Iran: పాక్ ప్రధానికి ఇరాన్ షాక్.. 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
- పాక్ ప్రధానికి ఇరాన్ షాక్
- 24 గంటల్లో ఒప్పందం ప్రకటనపై ఖండన
- జాగ్రత్తగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇరాన్ షాకిచ్చింది. 24 గంటల్లో ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగబోతుందని సోషల్ మీడియా వేదికగా షరీఫ్ ప్రకటించారు. దీనికి ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందంపై ఆదివారం సంతకం కాదని ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన 24 గంటల్లో ఒప్పందం ఖరారవుతుందనే వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ శనివారం మాట్లాడుతూ.. ఆదివారం ఒప్పందం సంతకం కాదని తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశాన్ని మాత్రం తోసిపుచ్చలేదు. మరో పక్షం నుంచి ఇంకా కొంత సంకోచం ఉన్నందున గడువులపై వ్యాఖ్యానించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
భిన్నంగా ఇరాన్ స్పందన
శనివారం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్‌లో స్పందిస్తూ.. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం వచ్చే 24 గంటల్లో ఖరారయ్యే అవకాశముందని ప్రకటించారు. ఒప్పందం తుది దశకు చేరుకుందని, ఖరారైన వెంటనే ఎలక్ట్రానిక్ సంతకాల ప్రక్రియ చేపట్టేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోందని వెల్లడించారు. “శాంతి ఒప్పందానికి మేము ఎన్నడూ లేనంత దగ్గరగా ఉన్నాం. వచ్చే 24 గంటల్లో తుది రూపు దాల్చే అవకాశం ఉంది. అనంతరం వచ్చే వారం సాంకేతిక స్థాయి చర్చలు జరగనున్నాయి” అని షరీఫ్ పేర్కొన్నారు. అలాగే చర్చల్లో పాల్గొంటున్న అమెరికా, ఇరాన్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఈ చారిత్రాత్మక ఒప్పందం ప్రాంతీయ శాంతికి బలమైన పునాది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికా, ఇరాన్ ప్రతినిధులు శాంతి ఒప్పందానికి సంబంధించిన తుది పాఠ్యంపై అంగీకారానికి వచ్చారని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ప్రకటించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ కూడా ఇటీవల చర్చలు గణనీయంగా ముందుకు వెళ్లినట్లు సంకేతాలు ఇచ్చారు. “ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం ఇప్పటివరకు ఎన్నడూ లేనంత దగ్గరగా ఉంది. తుది నిర్ణయం వెలువడే వరకు మీడియా ఊహాగానాలకు దూరంగా ఉండాలి” అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే ఒప్పందంలోని అంశాలపై వస్తున్న వార్తలపై ముందస్తు అంచనాలు వేయవద్దని సూచించారు. తుది ఒప్పందం ఖరారైన తర్వాత పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు.
తుది దశలో చర్చలు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఈ చర్చలు ఏప్రిల్ నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణను మరింత కాలం కొనసాగించడంతో పాటు ఆంక్షలు, హార్ముజ్ జలసంధి భద్రత, ఇరాన్ అణు కార్యక్రమం వంటి కీలక అంశాలపై విస్తృత చర్చలకు మార్గం సుగమం చేయనున్నాయి. ఇప్పటికైతే పాకిస్థాన్ ప్రకటించిన 24 గంటల గడువుకు ఇరాన్ బ్రేక్ వేసినప్పటికీ.. ఇరు దేశాలు ఒప్పందానికి గతంలో ఎన్నడూ లేనంతగా దగ్గరగా వచ్చాయని తాజా ప్రకటనలు సూచిస్తున్నాయి.
We are closer to a peace deal than ever before. With finalisation likely expected in the next 24 hours, Pakistan is preparing for the electronic signing of the peace deal immediately after, followed by technical level talks next week.
We would like to thank United States of…
— Shehbaz Sharif (@CMShehbaz) June 13, 2026
తాజావార్తలు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!