ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయి.. నిరాశలో ఉన్న కేజ్రీవాల్‌కు కేంద్రం షాకిచ్చింది. ‘శీష్ మహల్’ అక్రమాలపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వచ్చి రెండు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు.