తెలంగాణ కుంభమేళా.. వనదేవతల మహాజాతర మేడారంకు భక్తులు భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు తల్లిపిల్లలతో కలిసి వెళ్తున్నారు. అయితే.. మేడారం అనగానే గుర్తొచ్చేంది.. తినడం, తాగడం.. అందుకోసమని ఎన్ని డబ్బులు లెక్కచేయకుండా అక్కడికి వెళ్లి కనీసం మూడు, నాలుగురోజుల పాటు ఎంజాయ్ చేస్తారు. దేవతలను దర్శించుకున్నాక.. పచ్చని అడవిలో కుటుంబమంతా కలిసి కోళ్లు, మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇలా తమకు ఉన్నంతలో కోళ్లు గానీ, మేకలు గానీ కోస్తారు.
మీరు మటన్ ప్రియులా. అయితే తస్మాత్ జాగ్రత్త. తాజాగా గొర్రెలకు అంత్రాక్స్ వ్యాధి సోకుతుండటంతో… నాన్ వెజ్ ప్రియులు అలర్ట్‌గా ఉండాల్సిందే. ఇన్ని రోజులు మాంసం ప్రియులను బర్డ్ ఫ్లూ వణికించగా.. ఇప్పుడు ఆంత్రాక్స్ కలవరపెడుతోంది. అంత్రాక్స్ సోకిన గొర్రె మాంసంతో వండిన మటన్ తిన్నారో.. మీకూ రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. తెలంగాణ వ్యాప్తంగా ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో మృత్యువాతపడ్డాయి.…