‘ఇండియన్2’ వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల శంకర్ మద్రాస్ హై కోర్టులో ‘ఇండియన్ 2’ సినిమా ఇంత ఆలస్యం కావటానికి నిర్మాణ సంస్థ లైకాతో పాటు హీరో కమల్ హాసన్ కారణం అంటూ కౌంటర్ పిటీషన్ దాఖలు చేశాడు. అయితే దీనికి లైకా అనుకోని రీతిలో స్పందించింది. శంకర్ ప్రస్తుతం తెలుగులో, బాలీవుడ్ లో సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. అందుకే తెలుగు ఛాంబర్ కి, బాలీవుడ్ ఫిలిమ్ ఛాంబర్ కు లైకా శంకర్ మీద ఫిర్యాదు చేస్తూ లెటర్స్ పంపిందట. అంతే కాదు ‘ఇండియన్ 2’ పూర్తయ్యే వరకూ శంకర్ ఎక్కడా వేరే సినిమా షూటింగ్ చేయకుండా చూడాలని కోరింది. తెలుగులో దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా సినిమా చేయబోతున్నాడు శంకర్. అలాగే బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ హీరోగా ‘అన్నియన్’ ను రీమేక్ చేయబోతున్నాడు. పెన్ స్టూడియోస్ ఈ సినిమా నిర్మించనుంది. ఇక లైకా, శంకర్ కేసు జూన్ 4న హియరింగ్ కి రానుంది. మరి లైకా లెటర్స్ కి టాలీవుడ్, బాలీవుడ్ ఛాంబర్స్ ఎలా స్పందించనున్నాయి? జూన్ 4న మద్రాస్ హై కోర్టు ఏం చెప్పబోతోంది అన్నది వేచి చూడాల్సిందే.