సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఆర్‌సి 15’ ఈ ఏడాది చివరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటంటే… ‘ఆర్‌సి 15’ కోసం శంకర్ ప్రముఖ లిరిసిస్ట్ వివేక్ ను తీసుకుంటున్నారట. ఇంకా ఈ చిత్రం స్క్రీన్ ప్లేలో వివేక్ సహాయం చేయడమే కాకుండా కొన్ని ముఖ్యమైన డైలాగులు కూడా రాస్తున్నాడట. విజయ్ కోలీవుడ్ లో అత్యంత్య సక్సెస్ ఫుల్ లిరిసిస్ట్ లలో ఒకరు. ఆయనకు స్క్రీన్ ప్లేలో కూడా అనుభవం ఉండడంతో… అది ఈ చిత్రానికి అదనపు విలువను తెస్తుందని భావిస్తున్నారట శంకర్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ ను త్వరగా పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారట శంకర్. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ‘ఆర్సీ15’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో రామ్ చరణ్ ఐఎఎస్ అధికారి నుంచి ముఖ్యమంత్రిగా మారే యువకుడి పాత్రలో కన్పించబోతున్నారట.