విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఈ సారి టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఈ సీనియర్ ఆటగాళ్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో సెలక్టర్లకు జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కెప్టెన్‌పై సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. సీనియర్లు లేని జట్టులో మరో ఇద్దరు సీనియర్లు జట్టుకు దూరం కానున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు మహ్మద్ షమీ దూరం అయ్యే అవకాశముంది.