Samantha and Naga Chaitanya గత ఏడాది విడిపోయిన విషయం తెలిసిందే. ఈ మాజీ భార్యాభర్తల గురించి ఏ వార్త వచ్చినా ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా సమంత తన మాజీ భర్త నాగ చైతన్యను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. ఇప్పుడు ఈ విషయంపై నెట్టింట్లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరూ 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించారు. దాదాపు వీరిద్దరూ విడిపోయి ఐదు నెలలయ్యాక సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన మాజీ భర్త నాగ చైతన్యను అన్‌ఫాలో చేసింది.…
సౌత్ క్వీన్ సమంత ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఆమె స్టైల్ ను చూసి ఫ్యాషన్ ప్రియులు సైతం అబ్బురపడుతూ ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ హ్యాండ్ పెయింటెడ్ శారీలో మెరిసింది. నటి అర్చన జాజు చేతితో పెయింట్ చేసిన చీర కట్టుకుని అద్భుతమైన లుక్ తో ఆకట్టుకుంటోంది. సామ్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో ఏముంది ? అంటే… ఆమె కట్టుకున్న చీర ధర తెలిస్తే…
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘గంగూబాయి కథియవాడి’ రూపంలో అలియా భట్ మరో అద్భుత కళాఖండాన్ని ప్రేక్షకులకు అందించింది. ‘గంగూబాయి’ పాత్రలో అలియా భట్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సౌత్ సెన్సేషన్ సమంత కూడా తాజాగా ఈ మూవీని చూసి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా ‘మాస్టర్ పీస్’ అంటూ ‘గంగూబాయి కథియవాడి’ టీంపై ప్రశంసలు కురిపించింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో “#’గంగూబాయి కథియవాడి’ ఒక కళాఖండం!!…
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత నెక్స్ట్ మూవీ “శాకుంతలం” ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నాటకం “శాకుంతలం”. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణశేఖర్ రచించి, దర్శకత్వం వహించగా, ఆయన కూతురు నీలిమ గుణ నిర్మాణంలో రూపొందుతోంది. 2022లో టాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర దశలో ఉంది. కాళిదాసు రచించిన ప్రముఖ భారతీయ నాటకం “శకుంతల” ఆధారంగా…
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పౌరాణిక లవ్ డ్రామా “శాకుంతలం” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే సామ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న “శాకుంతలం” సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని ఫిబ్రవరి 21న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్టు అధికారికంగా వెల్లడించారు మేకర్స్. దీంతో మూవీ ఫస్ట్ లుక్ కోసం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హకు “శాకుంతలం” టీం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘శాకుంతలం’ షూటింగ్ సమయంలో అల్లు అర్హ చేసిన అల్లరిని మరింత క్యూట్ గా చూపించారు. Read Also : కైకాల ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్…
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ పాన్ ఇండియా పౌరాణిక చిత్రం “శాకుంతలం”. సమంత “శకుంతల”గా నటిస్తున్న ఈ సినిమాకు మేకర్స్ తాజాగా గుమ్మడికాయను కొట్టేశారు. తుది షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. దర్శకుడు గుణశేఖర్ కొన్ని కీలకమైన టాకీ సన్నివేశాలు, దుష్యంత్ పాత్రలో నటించిన హీరో దేవ్ మోహన్‌పై యుద్ధ ఎపిసోడ్‌ని ఇక్కడ రూపొందించారు. ఆగస్టు రెండో వారంలో ఈ సినిమాకు సంబంధించి సమంత తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. గుణశేఖర్ నేతృత్వంలోని పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ విజువల్…
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శాకుంతలం’. ఈ మైథలాజికల్ డ్రామాను గుణటీమ్ వర్క్ తో కలసి దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాళిదాసు రాసిన శకుంతల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తోంది. గురువారంతో శకుంతలగా నటిస్తున్న సమంత పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సమంతకు యూనిట్ ఘనమైన వీడ్కోలు పలికింది. ఇటీవల భరతునిగా నటించిన అల్లు అర్జున్ కుమార్తె అర్హకు వీడ్కోలు చెప్పిన సినిమా యూనిట్ ఇప్పుడు…
‘పుష్ప’ ‘భరతుడ్ని’ కలిశాడు! ఎక్కడా అంటారా? ‘శాకుంతలం’ సెట్స్ మీద! అల్లు అర్జున్, అల్లు అర్హా ఒకే లొకేషన్ లో తమ తమ సినిమాల కోసం షూట్ చేస్తుండటంతో బన్నీ కూతురు వద్దకి తరలి వచ్చాడు. అల్లు వారసురాలు ‘భరతుడి’ గెటప్ లో కెమెరా ముందు నటిస్తుంటే స్వయంగా ఐకాన్ స్టార్ చూసి మురిసిపోయాడు!‘శాకుంతలం’ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. అర్హా రాజకుమారుడు భరతుడుగా అలరించనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణికం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ తెరంగ్రేటం ఖరారైంది. ఈ మేరకు ఆమె ఎంట్రీని ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా “శాకుంతలం” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారానే అల్లు అర్హ తెరంగ్రేటం చేయబోతోంది. ఇందులో రాజకుమారుడు భరతుడిగా ఆమె నటించబోతున్నట్టు చిత్రబృందం ధృవీకరించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో అర్హను గుణశేఖర్ ఎత్తుకుని…