‘శకుంతల’కు ‘శాకుంతలం’ టీమ్ వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శాకుంతలం’. ఈ మైథలాజికల్ డ్రామాను గుణటీమ్ వర్క్ తో కలసి దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాళిదాసు రాసిన శకుంతల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తోంది. గురువారంతో శకుంతలగా నటిస్తున్న సమంత పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సమంతకు యూనిట్ ఘనమైన వీడ్కోలు పలికింది. ఇటీవల భరతునిగా నటించిన అల్లు అర్జున్ కుమార్తె అర్హకు వీడ్కోలు చెప్పిన సినిమా యూనిట్ ఇప్పుడు టైటిల్ పాత్రధారిణి సమంతకు కూడా సెండాఫ్ ఇచ్చింది. ఇక తన నటనను వెండితెరపై చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ తో పాటు నిర్మాతలు ట్వీట్ ద్వారా తెలియచేశారు.
సమంతతో వర్క్ చేయటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసిన నీలిమ గుణ సమంతను అమైజింగ్ టాలెంట్ ఉన్న కంప్లీట్ ఉమెన్ అని అన్నారు. ఇందులో దుశ్యంతునిగా దేవ్ మోహన్, దుర్వాస మహర్షిగా మోహన్ బాబు, మేనకగా మధు నటించగా గౌతమి, కబీర్ బేడి, వర్షిణి సుందర్ రాజన్ ఇతరపాత్రలను పోషించారు. కెనడా, హాంగ్ కాంగ్, చైనాలో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరపనున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- Varanasi Movie: 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
An absolute pleasure to see you become our “Shakuntala”, can’t wait for the world to witness your portrayal. Thank you @Samanthaprabhu2 🤍#Shaakuntalam @Gunasekhar1 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/HJWlanEAm5
— Dil Raju Productions (@DilRajuProdctns) August 12, 2021
An absolute pleasure to see you become our “Shakuntala”, can’t wait for the world to witness your portrayal. Thank you @Samanthaprabhu2 🤍#Shaakuntalam @Gunasekhar1 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/Hu7fA6HP6t
— Gunaa Teamworks (@GunaaTeamworks) August 12, 2021
Thank you @Samanthaprabhu2 so happy to have worked with you you’re a complete woman with amazing talent and grit, fun & fabulous…it has been an absolute pleasure to see you become our “Shakuntala” tq for all your hard work, belief & love for this role. #Shaakuntalam pic.twitter.com/ht2kudRE6O
— Neelima Guna (@neelima_guna) August 12, 2021
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?