ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత నెక్స్ట్ మూవీ “శాకుంతలం” ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నాటకం “శాకుంతలం”. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణశేఖర్ రచించి, దర్శకత్వం వహించగా, ఆయన కూతురు నీలిమ గుణ నిర్మాణంలో రూపొందుతోంది. 2022లో టాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర దశలో ఉంది. కాళిదాసు రచించిన ప్రముఖ భారతీయ నాటకం “శకుంతల” ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. ఇందులో సమంత అడవిలో తెల్లని దుస్తువులు ధరించి దేవకన్యలా అందంగా కన్పిస్తోంది. ఆమె తేజస్సు, చుట్టూ జంతువులు చేరడం ప్రేక్షకులను మరో ఫాంటసీ లోకానికి తీసుకెళ్తుంది.
Read Also : Pushpa : ‘పుష్ప’రాజ్ కు అరుదైన గౌరవం… మూవీ ఆఫ్ ది ఇయర్
ఇందులో పురు రాజవంశం రాజు దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఈ చిత్రంతో ప్రిన్స్ భరతుడిగా సినిమా రంగ ప్రవేశం చేయనుంది. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల మరియు వర్షిణి సౌందరరాజన్ తదితరులు ఈ చిత్ర తారాగణంలో భాగం కానున్నారు. గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, దిల్ రాజు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Presenting ..
— Samantha (@Samanthaprabhu2) February 21, 2022
Nature’s beloved..
the Ethereal and Demure.. “Shakuntala” from #Shaakuntalam ? #ShaakuntalamFirstLook@Samanthaprabhu2 @Gunasekhar1 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official @tipsofficial #MythologyforMilennials pic.twitter.com/q4fCjyfnth