Adhik Ravichandran: మార్క్ ఆంటోనీ సినిమాతో తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ కు ఎన్నో ప్లాపుల తరువాత అధిక్ హిట్ ఇవ్వడంతో కోలీవుడ్ మొత్తం అతనిపైనే కన్నేసింది.