హైదరాబాద్ మహానగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలో భారీగా గంజాయిని శంషాబాద్ డిటిఎఫ్( డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో గంజాయిని తరలిస్తున్న ముఠాను కొమురం భీం జిల్లా వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దు దాటే క్రమంలో పోలీసులు చాకచక్యంగా దొరకబట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా జిల్లా ఎస్పీకి సమాచారం వచ్చింది. దీంతో.. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ట్యాంకర్‌లో ఉన్న సుమారు 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నార పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ (TSNAB) అధికారులు సీజ్ చేశారు. ఓ కిలేడీ లేడీ.. గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు.
విశాఖ నగరంలో గంజాయి చాక్లెట్లు విక్రయం కలకలం రేపుతోంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. క్రాంతి థియేటర్ ఎదురుగా ఉన్న పాన్ షాపులో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణా పట్టుబడింది. భారీగా గంజాయిని తరలిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంఐఎం కార్పొరేటర్ కొడుకుతో పాటు మరో కేసులో తల్లి కొడుకు కూడా పట్టుబడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేశారు. ఈ ఘటనలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని.. 10 మంది నిందితులను అరెస్టు చేశారు.
లెక్కల్లో చూపని రూ.2 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కమిషనర్ టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ బృందం పట్టుకుంది. జూన్ 14న, ఇద్దరు నిందితులు, బజ్జూరి పూర్ణచందర్ (49), సయ్యద్ బాబా షరీఫ్ (25) ఇద్దరూ వరుసగా మెట్టుగూడ మరియు వరంగల్ నివాసితులు చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించడంలో విఫలమైనప్పుడు సికింద్రాబాద్‌లోని మెట్టుగూడలోని అపర్ణ ఉస్మాన్ ఎవరెస్ట్ అపార్ట్‌మెంట్ సమీపంలో అరెస్టు చేశారు. Bangalore: బెంగళూరు-తిరుపతి హైవేపై ప్రమాదం.. ముగ్గురు యువకుల…
లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కొలంబో లెజెండ్స్ క్రికెట్ లీగ్ సందర్భంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఇద్దరు భారతీయులను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా.. యోని పటేల్, పి ఆకాష్ పాస్‌పోర్ట్‌లను జప్తు చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇద్దరూ బెయిల్‌పై బయటికి వచ్చారు. అయితే ఈ కేసు విచారణ ముగిసేవరకూ దేశం వదిలి వెళ్లకుండా వారి పాస్‌పోర్ట్‌లను సీజ్ చేయాలని శ్రీలంక కోర్టు ఆదేశించింది. మార్చి 8 నుంచి…
Delhi : ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాలో రెండు మసాలా దినుసుల తయారీ ఫ్యాక్టరీల నుంచి ఆహార పదార్థాలు, నిషేధిత వస్తువులు, సిట్రిక్ యాసిడ్‌తో నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో కరెన్సీ నోట్లకు రెక్కలొచ్చాయి. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో పార్టీలు, అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు కలుగుల్లో దాచిపెట్టిన డబ్బులను బయటకు తీస్తున్నారు. బినామీల చేతుల మీదుగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అక్కడక్కడ తనిఖీల్లో దొరికిందే కొంత.. ఇంకా దొరకని సొమ్ము వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా కొరడా ఝులిపిస్తుంది.