సచిన్ తో ప్రేమలో పడి.. నేపాల్ మీదుగా ఇండియాలోకి వచ్చిన సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సీమా ప్రేమికురాలేనా.. లేదా పాకిస్థాన్ గూఢచారా అనే అనుమానాలు తావెత్తుతున్నాయి. సీమా హైదర్ ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్, తన ప్రేమికుడు సచిన్‌లను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (యూపీ ఏటీఎస్) వరుసగా మూడో రోజు విచారించింది. సీమాతో సచిన్ ఎలా స్నేహం చేశాడు.. ఆమె నేపాల్ ద్వారా అక్రమంగా భారత్‌కు ఎలా చేరుకుంది అని యూపీ ఏటీఎస్ ప్రెస్ నోట్ ఇచ్చింది.
2019లో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ఓ జంట ప్రేమగా మారి పాకిస్థాన్ నుంచి భారతీయ ప్రియుడి కోసం అక్రమంగా ఇండియాలో అడుగుపెట్టిన సీమా హైదర్ గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆమెనే కాదు.. సీమా బాయ్ ఫ్రెండ్ సచిన్ మీనా కూడా మిస్సైనట్లు కనిపిస్తుంది. గ్రేటర్ నోయిడాలోని వారి ఇంట్లో ఈ ఇద్దరూ గత రెండు రోజులుగా కనిపించడం లేదని చుట్టుపక్కల వారు తెలిపారు.