టీ20 ప్రపంచ కప్‌లో అసలు పోరు ప్రారంభానికి ముందు టీమిండియా అదరగొట్టింది. ఇప్పటికే తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్.. బుధవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు వార్నర్ (1), ఫించ్ (8) ఘోరంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్…
టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందో అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. యూఏఈలో పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువగా అనుకూలిస్తున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా అన్న అంశంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఆడించకుండా ఇషాన్ కిషన్‌ను పరీక్షించారు. ఈ టెస్టులో నూరు శాతం ఇషాన్ పాసయ్యాడు. ముఖ్యంగా…