రెండో ఎక్కం ఓ వరుడికి తిప్పలు తెచ్చిపెట్టింది. రెండో ఎక్కం చెప్పడం రాలేదని చెప్పి వధువు పెళ్లి క్యాన్సిన్ చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాకు చెందిన రంజిత్ మహిల్వార్ అనే వ్యక్తికీ వివాహం నిశ్చయమైంది. వివాహం రోజున వరుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన వధువు తరపు బంధువులు ఆ వ్యక్తిని రెండో ఎక్కం చెప్పమని కోరారు. అయితే, వరుడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. సైలెంట్ గా ఉండిపోయాడు. …