డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేసినా పసికూన ఐర్లాండ్ ముచ్చెమటలు పట్టించింది. చివరకు 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.…
టీమిండియా, ఐర్లాండ్ జట్ల మధ్య ఈరోజు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. రాత్రి 9గంటలకు డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన హార్డిక్ పాండ్యా సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్లు కుదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ వేగంగా ఆడటంలో తడబాటుకు గురైంది. దీంతో ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ డ్రా చేసుకోవచ్చని…
ఈనెల 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒడిశా కటక్‌లోని బారాబతి స్టేడియంలో జూన్ 12న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ మ్యాచ్‌కు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తొలి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, కార్యదర్శి సంజయ్ బెహెరా సీఎం నవీన్ పట్నాయక్‌కు తొలి టికెట్ అందజేశారు.…
ధర్మశాల వేదికగా శనివారం రాత్రికి టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ధర్మశాలలో ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రానికి వర్షం ఆగిపోయినా మబ్బులు ఉంటాయన్నారు. పైగా ఆదివారం జరిగే మూడో మ్యాచ్‌పైనా వాతావరణ ప్రభావం ఉండొచ్చని తెలిపారు. కాగా టీ20లలో టీమిండియా…
కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ (19) విఫలమైనా… మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. కోహ్లీ (52), కీపర్ రిషబ్ పంత్ (52) రాణించారు. పంత్, వెంకటేష్ అయ్యర్ కలిసి 35 బంతుల్లో 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోస్టన్ ఛేజ్…
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించడానికి చేరువలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఈరోజు జరిగే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ పేరు మీద…
టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరకుండా తమను అడ్డుకున్న న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే 2-0 తేడాతో భారత్ టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. రెండో టీ20లో 154 పరుగుల విజయలక్ష్యంతో దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ (55. ఒక ఫోర్, 5…
నేడు భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్ కు కరోనా ఆటంకం కలిగించింది. శిఖర్ ధావన్ కెప్టెన్సీలో లంకలో పర్యటిస్తున్న యువ భారత జట్టులో ఆల్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో నేటి మ్యాచ్ ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈరోజు చేసినా కరోనా పరీక్షలో బీసీసీఐ మెడికల్ బృందం కృనాల్ కరోనా బారిన పడినట్లు అలాగే అతనికి 8 మంది సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించింది. దాంతో…