Today Stock Market Roundup 02-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే మిగిలాయి. 8 రోజుల నష్టాల తర్వాత నిన్న బుధవారం లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్‌లో ఇవాళ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ రోజు గురువారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమై కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న రెండు కీలక సూచీలు ఇంట్రాడేలో కూడా కోలుకోలేకపోయాయి. ఐటీ మరియు బ్యాంకులు, ఆటోమొబైల్ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిణ్ని ఎదుర్కోవటంతో సాయంత్రం భారీ నష్టాల్లో…
Today (15-02-23) Business Headlines: షార్ట్ సెల్లింగ్‌ని నిషేధించం: ఈక్విటీ మార్కెట్‌లో షార్ట్ సెల్లింగ్‌ను నిషేధించే ఉద్దేశం లేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. సెబీ.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. షార్ట్ సెల్లింగ్ అనేది అవసరమేనని, దానివల్ల షేర్ల అసలు విలువను కనిపెట్టొచ్చని అభిప్రాయపడింది. 2020వ సంవత్సరం మార్చి నెలలో.. అంటే.. కరోనా ప్రారంభ సమయంలో.. 13 రోజుల్లోనే నిఫ్టీ విలువ 26 శాతం పతనమైనప్పటికీ షార్ట్ సెల్లింగ్‌పై నిషేధం విధించలేదని గుర్తుచేసింది.
దేశంలో ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు సంబంధించి ఓ స్కాం తాజాగా వెలుగు చూసింది. టెలిగ్రామ్‌ను ఉపయోగించుకుని షేర్ల ట్రేడింగ్ కుంభకోణానికి పలు సంస్థలు తెరతీశాయని ఆరోపణలు రావడంతో సెబీ రంగంలోకి దిగింది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సెబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా సంస్థలు టెలిగ్రామ్ ద్వారా 50 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్ల కోసం రికమండేషన్లు అందించినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన లిస్టెడ్ షేర్లకు సంబంధించి సలహాలు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లు…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)కి కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్‌పర్సన్‌ను నియమించింది. ప్రస్తుత ఛైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీ కాలం సోమవారం ముగుస్తున్నందున ఆ బాధ్యతలను సెబీ మాజీ సభ్యురాలు మాధవి పూరీ బుచ్‌కు అప్పగించింది. క్యాపిటల్ మార్కెటింగ్ రెగ్యులేటరీ సంస్థ అయిన సెబీకి ఛైర్‌పర్సన్‌గా ఓ మహిళను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా మూడేళ్ల పాటు మాధవి పూరీ బుచ్ నియామకానికి…
భారత ప్రభుత్వ రంగ భీమా సంస్థ ఎల్ఐసీ వద్ద రూ. 21,539 కోట్ల నిధులు ఉన్నట్టు ఆ సంస్థ తెలియజేసింది. ఇవి ఎవరూ క్లెయిం చేయని నిధులని పేర్కొన్నది. ఎల్ఐసీ సంస్థ పబ్లిక్ ఇష్యూకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం సెబీకి ధరఖాస్తు చేసుకున్నది. ఈ ధరఖాస్తులో పత్రాల్లో నిధుల కు సంబంధించిన వివరాలను పేర్కొన్నది. మార్చి 2020 నాటికి రూ. 16,052.65 కోట్ల అన్‌క్లెయిమ్ నిధులు ఉండగా, అవి 2021 మార్చినాటికి రూ. 18,495 కోట్లకు…
ఇటీవలే పేటీఎం కంపెనీ భారీ ఐపీఓను సాధించింది. పేటీఎం ఇచ్చిన స్పూర్తితో అనేక కంపెనీలు షేర్ మార్కెట్ లో లిస్టింగ్ చేసుకోవడానికి ధరఖాస్తులు చేసుకుంటున్నాయి. సోమవారం రోజున స్పెషాలిటి కోటింగ్ ఎమల్షన్స్ కంపెనీ జేసన్స్ ఇండస్ట్రీస్ ఐపీఓకి ధరఖాస్తు చేసుకుంది. దీనికి సంబందించి సెబీకి ప్రాథమిక పత్రాలను కంపెనీ సమర్పించింది. రూ.800 నుంచి 900 కోట్లు సమీకరణే లక్ష్యంగా పెట్టుకున్నది. Read: రైతుల గుండెలు ఆగినా…మీ గుండె కరుగటం లేదా ? : షర్మిల…
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా అలియాస్ రిపు సుడాన్ కుంద్రా, అతని సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ అంతర్గత వ్యాపారంలో సరైన నిబంధనలను పాటించనందుకు ‘మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ దోషులుగా తేల్చింది. ఈ కారణంగా దంపతులు రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలకు రూ.3 లక్షల జరిమానా విధించారు. రాజ్ కుంద్రా, శిల్పా వయాన్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు. అక్టోబర్ 2015లో వియాన్ ఇండస్ట్రీస్ నలుగురు వ్యక్తులకు రూ.5 లక్షల…