ఐపీఓలలో షేర్ల ధరలపై సెబీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇష్యూ ధరలనేవి సమంజసంగా ఉండాలని, అలా ఉంచాల్సిన బాధ్యత మర్చంట్ బ్యాంకర్లేదని అని సెబీ ఛైర్మన్ త్యాగి తెలిపారు. మార్కెట్ వాస్తవ పరిస్థితులను తెలుసుకొని ఇష్యూ ధరలు ఉండాలని ఆయన పేర్కొన్నారు. కంపెనీల ఆశలు, మదుపర్ల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, వాటిమధ్య సమతూకం పాటించేలా పబ్లిక్ ఇష్యూల ధరలు ఉండాలని అన్నారు. సెబీ సూచనలు తప్పకుండా పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Read: తెలంగాణలో కొత్తగా మరో 14 ఒమిక్రాన్ కేసులు…
ఇక కొత్తగా వచ్చే టెక్నాలజీ కంపెనీల కోసం నిబంధనల్ని సవరిస్తామని అన్నారు. ఇటీవలే కొన్ని కంపెనీలు ఐపీఓ ద్వారా భారీ నిధులను సమీకరించినప్పటకీ స్టాక్ ఎక్చేంజీలలో లిస్టింగ్ తరువాత షేర్లు అనుకున్నంతగా రాణించలేకపోయాయి.