ఇటీవలే పేటీఎం కంపెనీ భారీ ఐపీఓను సాధించింది. పేటీఎం ఇచ్చిన స్పూర్తితో అనేక కంపెనీలు షేర్ మార్కెట్ లో లిస్టింగ్ చేసుకోవడానికి ధరఖాస్తులు చేసుకుంటున్నాయి. సోమవారం రోజున స్పెషాలిటి కోటింగ్ ఎమల్షన్స్ కంపెనీ జేసన్స్ ఇండస్ట్రీస్ ఐపీఓకి ధరఖాస్తు చేసుకుంది. దీనికి సంబందించి సెబీకి ప్రాథమిక పత్రాలను కంపెనీ సమర్పించింది. రూ.800 నుంచి 900 కోట్లు సమీకరణే లక్ష్యంగా పెట్టుకున్నది.
Read: రైతుల గుండెలు ఆగినా…మీ గుండె కరుగటం లేదా ? : షర్మిల ఫైర్
ఈ ఇష్యూలో రూ.120 కోట్లు విలువ చేసే షేర్లు తాజావి కాగా, మరో 1,21,57,000 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తున్నారు. కాగా, ఐపీఓలో విక్రయిస్తున్న వాటిలో 77,000 ఈక్విటీ షేర్లను ఉద్యోగుల కోసం రిజర్వ్ చేశారు. వీటి విలువ రూ.24 కోట్లు ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమీకరణ ద్వారా వచ్చే నిధులలో రూ.90 కోట్లను రుణాల చెల్లింపుకు వినియోగించబోతున్నారు. మిగిలిన మొత్తాన్ని కంపెనీ అవసరాల కోసం వినియోగిస్తారు.