సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర ఇంటిలో భారీగా నగదు లభ్యమైంది. ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 60 లక్షల రూపాయల నగదు తోపాటు పెద్ద ఎత్తున వెండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 20కి పైగా ఆస్తుల పత్రాలను స్వాధీనపరుచుకున్నారు. బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉమామహేశ్వరరావు, అన్నా, మామతో పాటు ఇద్దరు మిత్రుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. సాహితీ ఇన్ఫ్రా విచారణ అధికారిగా కొనసాగుతున్న ఉమామహేశ్వరరావు విచారణకు సహకరించడం లేదని అధికారులు వెల్లడించారు. ఉమామహేశ్వరరావు డైరీలో కొన్ని పేర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందులో సందీప్ అనే పేరు రాసి ఉందన్నారు.
READ MORE: CM Revanth Reddy: మనవడి మొక్కు.. కుటుంబ సమేతంగా తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
ఉమామహేశ్వరరావు, సందీప్ కలిసి పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. సందీప్ పాత్ర పై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. సీసీఎస్ లో ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలను వెరిఫై చేస్తున్నట్లు వెల్లడించారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో బాధితుల దగ్గర నుంచే ఉమామహేశ్వరరావు డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా… గతంలో ఇబ్రహీం పట్నం ఏసీపీగా ఉన్న సమయంలో ఉమా మహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు, సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. నిందితులకు సపోర్ట్ చేసి బాదితులకు అన్యాయం చేశాడని పలువురు ఆరోపించారు.