Cyclone Montha: మొంథా తీవ్ర తుఫాన్ విధ్వంసంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేసింది. వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన 43 రైళ్లను తొలుత ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేయగా.. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 27, 28, 29, 30 తేదీల్లో రద్దు చేసిన పలు రైళ్లకు సంబంధించిన…
Cyclone Mentha Effect: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మెంథా’ తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తుపాను తీవ్రత, వర్షాల పరిస్థితిని బట్టి సెలవుల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తుపాను ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అత్యధికంగా కాకినాడ జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 31 వరకు ఐదు రోజులు…
పాక్ పన్నాగాలను తిప్పికొడుతూనే.. ముందుస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది భారత్.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో అంతటా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. జమ్మూతో పాటు కాశ్మీర్ అంతటా అన్ని పాఠశాలలు నేడు మరియు రేపు మూసివేయబడతాయి..
తీవ్ర వాయుకాలుష్య నేపథ్యంలో పాఠశాలలను మూసివేయాలని బీజేపీ, ఢిల్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పిల్లల జీవితాలను ఆడుకోవడం మానేసి స్కూళ్లను మూసివేయాలని బీజేపీ కోరింది. ఢిల్లీలో పార్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పనిచేస్తున్నారని బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాల విమర్శించారు. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Tamil Nadu Rains: తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై నగరంతో పాటు పలు జిల్లాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచింది. పలు చోట్ల సబ్ వేలను మూసేశారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా చెన్నై, పుదుచ్చేరిలో సెలవులు ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. పుదుచ్చేరిలో రెండు రోజుల పాటు స్కూళ్లు,…
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. ఇప్పటికిప్పుడు ఆ దేశ పరిస్థితి మెరుగయ్యే అవకాశం కనిపించడం లేదు. దేశంలో ఆహారంతో పాటు ఇంధన సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా ప్రజలు పెట్రోల్, డిజిల్, గ్యాస్ కోసం క్యూ లైన్లలో దర్శనమిస్తున్నారు. రోజుల తరబడి ఎదురుచూసిన శ్రీలంకలో లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంది. విదేశీమారక నిల్వలు అడుగంటుకుపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం మరోసారి కీలక…
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలో మరోసారి కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగా 461 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 26 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఢిల్లీలో పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం మార్గదర్శకాలను…
ఏపీలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పాఠశాలలకు రేపు(నవంబర్ 29) అధికారులు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రాబోయే రెండు రోజుల్లో అవి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. Read Also: కడప జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు…
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం నుంచి వారం పాటు విద్యాసంస్థలు బంద్ చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసులు కూడా వారం పాటు వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 17 వరకు ఎలాంటి భవన నిర్మాణ పనులు…
తెలంగాణ వ్యాప్తంగా గులాబ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో.. ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.. రేపు, ఎల్లుండి జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.. వాయిదా పడిన పరీక్షలు మరల…