మార్వెల్ యూనివర్స్ లో అన్ని పాత్రలకూ ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. తాజాగా స్కార్లెట్ జోహన్సన్ ప్రధాన పాత్రలో నటించిన “బ్లాక్ విడో” వివాదం ముదురుతోంది. తాజాగా డిస్నీపై స్కార్లెట్ కేసు వేస్తూ కోర్టు మెట్లెక్కడం గమనార్హం. లాస్ ఏంజిల్స్ సుపీరియర్ కోర్టులో గురువారం ఈ దావా వేయబడింది. స్టూడియో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా థియేటర్లలో మాత్రమే విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆమె ఒప్పందం ఉల్లంఘించబడిందని స్కార్లెట్ తరపు న్యాయవాదులు ఆరోపించారు. స్టూడియో చర్య సినిమా టికెట్ అమ్మకాలను…
కరోనా ఎఫెక్ట్ తో మూతపడ్డ థియేటర్లు ఇంకా దేశమంతటా పూర్తిగా తెరుచుకోకపోవటంతో డిస్నీ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 9న అమెరికా, బ్రిటన్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ‘బ్లాక్ విడో’ సినిమా ఇండియాలో బాక్సాఫీస్ కి దూరంగా ఉండనుంది. నేరుగా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలిపేలా ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా డిస్నీ ఇండియా సంస్థ చేసింది. అయితే, హాట్ స్టార్ లో ‘బ్లాక్ విడో’…
కరోనా ప్యాండమిక్ దారుణం నుంచీ హాలీవుడ్ పూర్తిగా కొలుకున్నట్టేనా? దాదాపుగా అంతే అనిపిస్తోంది! ఇంకా ప్రపంచం మొత్తం మహమ్మారి బారి నుంచీ బయటపడలేదు. థియేటర్స్ ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. జనం కూడా కరోనాకి ముందటి కాలంలోలాగా ఇప్పుడు రావటం లేదు! అయినా హాలీవుడ్ చిత్రాలు మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేసి సినిమా సత్తాని చాటుతున్నాయి. ఈ వారాంతంలో ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించిన చిత్రం మర్వెల్ సూపర్ హీరో మూవీ ‘బ్లాక్ విడో’. వీకెండ్ లో 80…
భారతదేశంలోనే కాదు ఒకప్పుడు ప్రపంచం అంతటా పిల్లలు కథలు వినేవారు! పెద్ద వాళ్లు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని వారికి రకరకాల కహానీలు చెప్పేవారు! కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇండియాలో ఉన్న పరిస్థితే వెస్టన్ కంట్రీస్ లోనూ కనిపిస్తోంది. పిల్లలు స్మార్ట్ ఫోన్ లోనో, కంప్యూటర్ లోనో, టీవీలోనో తల దూర్చేస్తున్నారు. కథలు ‘వినటం’ పూర్తిగా పోయింది. కళ్లప్పగించి ‘చూడటం’ మాత్రమే మిగిలింది! ‘వినటం’ వల్ల పిల్లల్లో ‘ఊహా శక్తి’ పెరుగుతుంది. కానీ, ఆధునిక టెక్నాలజీ ‘బొమ్మల’…
హాలీవుడ్ స్టార్ బ్యూటీ స్కార్లెట్ జోహాన్సన్ ‘టవర్ ఆఫ్ టెర్రర్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. డిస్నీ కామిక్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందట. ఖచ్చితంగా కథ ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే, ‘టాయ్ స్టోరీ 4’ దర్శకుడు జోష్ కూలే ప్రస్తుతం స్క్రిప్టింగ్ చేస్తున్నాడు. ఆయన సారథ్యంలోనే స్కార్లెట్ జోహాన్సన్ మూవీ ‘టవర్ ఆఫ్ టెర్రర్’ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆమె తన బ్యానర్ ‘దీస్ పిక్చర్స్’పై ఈ చిత్రాని నిర్మించనుంది. అయితే, స్కార్లెట్…