ఏజ్ పెరిగే కొద్ది ఎవరికైనా, చర్మంపై ముడతలు రావడం కామన్.. గీతలు, మచ్చలు కూడా చర్మం పై రావడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ ఈరోజుల్లో మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే ముడతలు రావడం చూస్తూనే ఉంటాం.. ఒత్తిడి, చెడు ఆహారం అలవాట్లు, నిశ్చల జీవనశైలి, కాలుష్యం వంటి కారణాల వల్ల 30 దాటక ముందే.. ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం పదార్థాల కారణంగానూ చిన్నవయస్సులోనే చర్మంపై ముడతలు, గీతలు పడుతున్నాయి..…