Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
- సౌదీ రక్షణకు 8000 మంది పాకిస్తాన్ సైనికులు..
- గల్ఫ్ దేశంలో మోహరించిన పాక్ యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్..
- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మోహరింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Saudi Arabia: అమెరికా-ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణానైనా ఇజ్రాయిల్, యూఎస్ కలిసి ఇరాన్‌పై దాడి చేసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్తాన్ సైనికులు వెళ్తున్నారు. గతేడాది పాకిస్తాన్-సౌదీ అరేబియాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా సౌదీలో కిరాయి సైనికులుగా పనిచేయడానికి పాక్ సైనికులు వెళ్తున్నారు. 8000 మంది సైనికులు, ఒక ఫైటర్ జెట్ స్వ్కాడ్రన్, వాయు రక్షణ వ్యవస్థను పాక్ సౌదీలో మోహరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అయితే, ఈ విషయంపై పాకిస్తాన్ సైన్యం, విదేశీ మంత్రిత్వ శాఖ, సౌదీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ రెండు దేశాల ఒప్పందం ప్రకారం, ఒకరిపై జరిగిన దాడిని మరొకరిపై దాడిగా పరిగణించి రెండు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ అణు రక్షణ గొడుగు కిందకు వస్తుందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రస్తుతం చైనీస్ తయారీ యుద్ధ విమానం జేఎఫ్-17లతో సహా, 16 ఫైటర్ జెట్లతో కూడిన ఒక స్వ్కాడ్రన్‌ను సౌదీ అరేబియాలో మోహరిస్తోంది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ఇదే కాకుండా చైనా తయారీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 కూడా మోహరించింది. ప్రస్తుతం 8000 మంది పాక్ సైనికులను తరలించగా, భవిష్యత్తులో పరిస్థితులను బట్టి 80,000 మందిని కూడా పంపొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఆయుధాలు, సైనికులు పాకిస్తాన్‌కు చెందిన వారు కాగా, వారి ఖర్చుల్ని సౌదీ అరేబియా భరిస్తుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!