OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్‌లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- చమురు ఉత్పత్తి కోటా పెంచకపోతే ఒపెక్‌ను వీడతామని ఇరాక్ హెచ్చరిక.
- ఇప్పటికే యూఏఈ ఒపెక్ నుంచి నిష్క్రమణ.
- రోజుకు 70 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి లక్ష్యంగా ఇరాక్ ప్రణాళిక.
- సౌదీ ఆధిపత్యంపై సభ్య దేశాల అసంతృప్తి పెరుగుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPEC: యూఏఈ తర్వాత ఇరాక్ ఇప్పుడు సౌదీ అరేబియాకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్(OPEC)లో సౌదీ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి, ఒపెక్ వీడేందుకు ఇరాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. చముర ఉత్పత్తి కోటాపై సౌదీతో పలు దేశాలు విభేదిస్తున్నాయి. ఇప్పటికే యూఏఈ ఒపెక్‌ను వీడింది. ఇప్పుడు ఒపెక్‌లో రెండో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉన్న ఇరాన్ కూడా ఇదే బాటలో వెళ్లేందుకు సిద్ధమైంది. తమ చమురు ఉత్పత్తి కోటాను గణనీయంగా పెంచకపోతే ఒపెక్‌లో ఉండాలా? వైదొలగాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఇరాక్ అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం, ఇరాక్ రోజుకు సుమారు 40 లక్షల బ్యారెల్ల చమురును ఉత్పత్తి చేస్తోంది. అయితే, దేశ ఉత్పత్తి సామర్థ్యానికి, దేశ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా కోటా పెంచాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దశాబ్ధాల పాటు యుద్ధాలు, ఆర్థిక ఆంక్షలు, అంతర్గత అస్థిరత, ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దేశాన్ని పునర్నిర్మించాలంటే మరింత అధిక చమురు ఆదాయం అవసరమని ఇరాక్ భావిస్తోంది. దీని కోసమే తమ కోటా పెంచాలని ఒత్తిడి చేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో రోజుకు 70 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తిని ఇరాక్ లక్ష్యంగా పెట్టుకుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
ఒపెక్ అంటే ఏమిటి.?
ఒపెక్ ప్రపంచంలో చమురు ఉత్పత్తి దేశాల కూటమి. 1960లో ఈ కూటమి ఏర్పడింది. చమురు ధరలు, విధానాలపై ఉత్పత్తి ఈ దేశాల నియంత్రణలో ఉంటుంది. మే 1 నుంచి ఈ కూటమి నుంచి యూఏఈ వైదొలగడంతో ఈ సమూహంలో 11 దేశాలు మిగిలాయి. ఇప్పుడు ఇరాక్ కూడా వైదొలుగేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇరాక్‌తో పాటు ఈ గ్రూపులో అల్జీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, గాబన్, లిబియా, నైజీరియా, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా.
ఈ గ్రూపులో ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయి. సౌదీ ప్రపంచ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి తనకు ఇష్టం ఉన్నట్లు ఆయిల్ ఉత్పత్తిని పెంచడం, తగ్గించడం వంటి వాటిని ప్రభావితం చేస్తోంది. ఈ కారణంగానే యూఏఈ ఇటీవల ఒపెక్ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు ఇరాక్ కూడా సౌదీని వ్యతిరేకిస్తోంది. ఇరాక్ ఒకవేళ ఒపెక్ నుంచి బయటకు వస్తే ఆ సంస్థ మరింత వీక్ అవుతుంది.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..