దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే ఆర్మీ జవాన్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు.. అమరాపురం మండలం ఉదుకూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాఫ్ రూం తాళం పగలగొట్టి కొందరు దుండగులు పాఠశాల రికార్డులను తగలబెట్టారు. గదిలో రికార్డులు, పరీక్ష పత్రాలు కాలి బూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో దుండగులు పాఠశాలలోకి చొరబడి పాఠశాల రికార్డులను ధ్వంసం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ విడుదలైంది.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన డార్లింగ్ సినిమా బొమ్మ థియేటర్లలో పడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సినిమా విడుదల అవుతుందన్న వారం ముందు నుంచే థియేటర్లను ముస్తాబు చేసి అందంగా తయారు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు.. తాజాగా ఓ అభిమాని విధ్యుత్ షాక్ గురై ప్రాణాలను వదిలాడు.. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాల్లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే..…
Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో ఆదివారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బాధాకరమన్నారు. వరద పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్థానిక నాయకులు. అధికారులతో సమస్యను తెలుసుకుని కలెక్టర్‌తో వరద పరిస్థితిపై సమీక్షించామని బాలకృష్ణ తెలిపారు. కొట్నూరు, శ్రీకంఠాపురం, పూలకుంట సమీపంలో బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని…
తెలుగు రాష్ట్రాల్లో వరుస పరువు హత్యలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రేమ పేరుతో ముడిపడిన బంధాలు.విడిపోయి బతకడం ఇష్టంలేక ఇద్దరు కలిసి వుండాలనే నేపథ్యంలో పెళ్ళి చేసుకుని ఆనందంగా గడిపినా తల్లిదండ్రులు ఓర్వలేని స్థితిలో వుంటున్నారు. కులాలు వేరని, తక్కువ కులం ఎక్కువ కులం మంటూ పరువు ప్రతిష్టలకు పోయి పిల్లల ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు. ఇరుగుపొరుగు వారు ఏమనుకుంటారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. తాను అతనితో బతకడం కన్నా చావడం మేలంటూ హత్య చేస్తున్నారు. తెలంగాణ…
సత్యసాయి జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. నీటి కేటాయింపు విషయంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు బహిర్గతం అయ్యాయి. గత ఏడాది ఏ విధంగా నీటి కేటాయింపులు జరిగాయో ఈ ఏడాది కూడా అదే విధంగా నీటి కేటాయింపులు జరగాలని పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. అయితే తన నియోజకవర్గానికి ఆయకట్టు ప్రాతిపదికన కేటాయింపు జరగాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోరారు.…
శ్రీసత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును అత్యాచార కేసుగా మారుస్తున్నట్లు ఎస్పీ రాహుల్ దేవ్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసును దిశ పోలీసులకు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 4న గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో ప్రియుడు సాదిక్‌కు సంబంధించిన ఓ షెడ్డులో తేజస్విని ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. దీంతో పోలీసులు తొలుత తేజస్విని మృతిని ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు.…
ఏపీలో 13 కొత్తజిల్లాలు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. గతంలో వున్న 13 జిల్లాలకు ఇవి అదనం. మొత్తం 26 జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. అనంతపురం జిల్లాలో వున్న ప్రముఖ పుట్టపర్తిని శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు శుభపరిణామం అన్నారు. జిల్లా కేంద్రంగా ప్రకటించడం వల్ల ఉద్యోగ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్ వి జానకీరామయ్య ఆకాంక్ష…