Tummala Nageswara Rao : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్ల పల్లి గ్రామంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. 40 ఏళ్ల చరిత్రలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు జరిగాయన్నారు. సత్తుపల్లి ప్రజలకు ఎక్కడ ఉన్న రుణపడి ఉంటానని, నా నియోజకవర్గం కంటే సత్తుపల్లి కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆగిపోయిన సీతారామ ప్రాజెక్ట్‌ను కదిలిచ్చి గోదావరి జలాలు తమ్మిలేరు ద్వారా బెతుపల్లి కి తరలిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉగాది కల్ల సత్తుపల్లి నియోజకవర్గంలో మరొక పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. నర్సింగ్ కాలేజ్ కూడా సత్తుపల్లి లో పెడుతున్నామని, పిల్లల భవిష్యత్ దృష్ట్యా నర్సింగ్ కాలేజ్ ను పెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. సత్తుపల్లి నుండి కొవ్వూరు కు రైల్వే లైన్ కు ప్రతిపాదనలు పంపిస్తున్నామని, సత్తిపల్లిని రైల్వే పరంగా అభివృద్ధి చేయాలనేది నా ఆకాంక్ష అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వ్యాఖ్యానించారు.
Giorgia Meloni: విదేశీ రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యం.. ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
అంతేకాకుండా..’రాముడి దయ ఉన్నంతవరకు పొలాలకు నీరు,పిల్లలకు చదువు,అభివృద్ధి చేస్తాను. ముఖ్యమంత్రినీ అందించిన నియోజకవర్గం సత్తుపల్లి. 40 ఏళ్లలో వేంసూరు మండలాన్ని పంటలమయం చేసింది బెతుపల్లి కాలువ. రైతులందరూ పామాయిల్ వేయాలి. రైతు చల్లగా ఉంటే దేశం చల్లగా ఉంటుంది. మొదటి సంవత్సరం లోనే రైతుల ఖాతాల్లోకి 40వేల కోట్లు వచ్చాయి. ప్రభుత్వమే పంటలకు ఇన్స్యూరెన్స్ చేయిస్తుంది.. రైతంగా సమస్యల పట్ల వెనకడుగు వేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. నాకిష్టమైన వ్యవసాయానికి అన్ని పనులు చేసే అవకాశం వచ్చింది.’ అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
L&T Chairman: ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలి.. దీపికా పదుకొణె షాకింగ్ రియాక్షన్