గుంటూరు జిల్లాలో ఓ మహిళపై కొంతమంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మేడికొండూరు మండలంలోని పాలడుగులో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి గుంటూరులోని ఓ వివాహానికి హాజరయ్యి బైక్ వస్తున్న భార్య, భర్తలను మేడికొండూరు మండలంలోని అడ్డరోడ్డు వద్ద అడ్డుకున్నారు. భర్తను చితకబాది, మహిళను కత్తులతో బెదిరించి పోలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం అర్థరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. అయితే, సంఘటన జరిగిన ప్రాంతం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని, తమది రూరల్ ప్రాంతంలో ఉన్న స్టేషన్ అని పోలీసులు చెప్పినట్టు బాధితురాలు పేర్కొన్నది. రాష్ట్రంలో ఘటన ఎక్కడ జరిగినా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఇలా చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దిశా చట్టం అమల్లోకి తీసుకొచ్చినా మహిళలపై ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దిశా యాప్‌పై ఇంకా విస్తృతంగా ప్రచారం కల్పించాల్సి ఉందని ఈ ఘటన ద్వారా అర్థం అవుతున్నది.
Read: తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచనుందా?