సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. ఆ విషయాన్ని అధికారికంగా నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు కూడా! కానీ ఇప్పుడు ఆ తేదీన పలు చిత్రాలు విడుదల కానుండటంతో తాము కాస్తంత వెనక్కి వెళుతున్నట్టు తెలిపారు. నిజానికి సెప్టెంబర్ 3న ‘గల్లీ రౌడీ’తో పాటు మరో రెండు మూడు సినిమాలూ విడుదలకు సిద్ధమయ్యాయి.…