గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. వైసీపీ ఎంపీటీసీ తాడబోయిన పద్మావతి సడెన్‌గా అదృశ్యమవ్వడం పెను సంచలనానికి దారి తీసింది. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిన ఆమె, తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో, ఆమె కుమారుడు యోగేంద్రనాథ్ తన తల్లిని కిడ్నాప్ చేశారంటూ ఆరోపణలు చేశారు. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా తన తల్లిని ఇంటి నుంచి ఎమ్మెల్యే బలవంతంగా తీసుకువెళ్ళారని, తన తల్లి ఎక్కడున్నారో చెప్పాలని…