ఐపీఎల్ 2024లో అదరగొట్టిన వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కింది. మెగా టోర్నీకి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రపంచకప్ అనంతరం శ్రీలంక పర్యటనలో వచ్చిన రెండు అవకాశాలను వృథా చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో సెంచరీ చేసిన సంజూ.. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు.…