కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సంజయ్ రాయ్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కుమారుడు ఎవరికి హాని చేయడని చెప్పింది. ఎవరో తన కొడుకును ఇరికించారని.. అతనిని కఠినంగా శిక్షించాలని రాయ్ తల్లి డిమాండ్ చేసింది.
కోల్‌కతా అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్.. నేరం చేయడానికి ఒక రోజు ముందు ఆగస్టు 8న బాధితురాలిని ఛాతీ మందుల వార్డు వరకు ఫాలో అయినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ క్రమంలో.. ఆసుపత్రి ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. 33 మంది వ్యక్తులు బాధితురాలితో…