‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన కరోనా కష్టకాలంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహరం, శాండల్ వుడ్ సినీ కార్మికుల కుటుంబాలకు తాను స్థాపించిన సంజన గల్రాని ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “కోవిడ్ బాదితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలను పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నేను ఉడతా భక్తిగా మే 10 నుండి ఇంటి సెల్లార్ లోనే వంట వండించి…