Sri Tej :అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్స్ షో తొక్కిసలాటను ఎవరూ మర్చిపోలేదు. సంధ్య థియేటర్ లో జరిగిన ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇప్పటికీ కోలుకోలేదు. కోలుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో శ్రీతేజ్ కు అండగా నిలబడేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ట్రీట్ మెంట్ ఖర్చులు భరిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు మిషన్ వాత్సల్య పథకాన్ని అందిస్తామని ప్రకటించింది.…
డిసెంబర్ నెల 5వ తేదీన పుష్ప 2 సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ అయింది. అయితే ఒక రోజు ముందుగానే హైదరాబాదులో ఉన్న సింగిల్ స్క్రీన్స్ తో పాటు కొన్ని మల్టీప్లెక్స్ లలో పుష్ప సినిమాను ప్రీమియర్ గా ప్రదర్శించారు. అందులో సంధ్య థియేటర్ ప్రీమియర్స్ కోసం అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబం, హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలిసి ఆ సంధ్య థియేటర్ కి ఫ్యాన్స్ తండోపతండాలుగా…
Patnam Narendar Reddy : ఆరు గ్యారంటీ ల గురించి అసెంబ్లీలో చర్చ సైడ్ ట్రాక్ మళ్లించేందుకే అల్లు అర్జున్ పై అనవసర చర్చ పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి పై కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తప్పు పట్టారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష్యసాదింపులో భాగంగానే లగచర్ల కేసులో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంట్లో కీలక సమావేశం జరుగుతోంది. తమ లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్ సమావేశమయ్యారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో మృతి చెందిన రేవతికి ఇప్పటికే అల్లు అర్జున్ పాతిక లక్షలు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో ఇప్పటికే 10 లక్షలు ఇచ్చారని మరొక 15 లక్షల ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయితే మరొక పక్క సుకుమార్ భార్య తబిత కూడా ఇప్పటికే ఐదు లక్షలు అందించారు. ఇదిలా ఉండగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుమారుడు పేరిట ఏర్పాటు చేసిన ప్రతీక్ ఫౌండేషన్ నుంచి పాతిక లక్షలు ఆర్థిక సాయం…
సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు,అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు. అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు…కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ…
సంధ్య థియేటర్ లో తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతానికి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు ఆ బాలుడిని హైదరాబాద్ సి పి సి వి ఆనంద్ పరామర్శించారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి రెండు వారాలు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు ప్రభుత్వం తరఫున తనతో పాటు హెల్త్ సెక్రటరీ కూడా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నామని…
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అల్లు అర్జున్. బాలుడి ఆరోగ్యం గురించి ఎంతో సానుభూతితో ఉన్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. కేసు విచారణ కొనసాగుతున్నందును శ్రీతేజ్‌ను కలవలేకపోతున్నానని అల్లు అర్జున్ వెల్లడించారు.