అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. తాజాగా ఈ విషయం మీద స్పందిస్తూ అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ట్విట్టర్ వేదిక వీడియో రిలీజ్ చేసిన ఆయన సంధ్య థియేటర్లో జరిగిన దారుణ ఘటన తనకు తీవ్రమైన మనోవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు.…