సోమవారం అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కోట్లాది మంది రామభక్తులకు మరపురాని రోజని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో తరాలు ఎదురుచూశాయని, అయితే రామజన్మభూమిలో మళ్లీ ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని, నమ్మకాన్ని ఏవీ వమ్ము చేయలేదని షా అన్నారు. మరోవైపు.. రామమందిరం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులు అర్పించారని తెలిపారు. వారు ఎన్నో అవమానాలు, చిత్రహింసలు ఎదుర్కొన్నారని అయితే మత మార్గాన్ని వీడలేదని షా…