Yogi Adityanath: గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మహంత్ దిగ్విజయనాథ్ 56వ వర్ధంతి మరియు మహంత్ అవైద్యనాథ్ 11వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ‘‘ ఈరోజు భారతదేశంలో అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉన్న గొప్ప ఆలయాన్ని చూసి ఎవరు గర్వపడరు..? ఎవరైనా గర్వంచకపోతే, వారు భారతీయులనేది సందేహమే’’ అని ఆదిత్యనాథ్ అన్నారు. Read Also: Bellamkonda : కిష్కింధపురి లాంటి హారర్ సినిమా అందరితో కలిసి థియేటర్స్ లో చూడండి…
Sanatana Remarks: శరద్ పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘సనాతన ధర్మాన్ని’’ గురించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్ర ఆదివారం ‘‘కాంగ్రెస్ ఎకో సిస్టమ్’’ పై విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని కించపరచాలని, హిందూ ఉగ్రవాదం వంటి పదాలను ఉపయోగించాలని జితేంద్ర అవద్ నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి పెద్ద ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఇకపై హిందూ మతంలో భాగం కాదని ఆయన అన్నారు. అతన్ని హిందూ మతం నుంచి బహిష్కరిస్తామని ప్రకటించారు. బద్రీనాథ్‌లోని శంకరాచార్య ఆశ్రమంలో స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ..
దేశవ్యాప్తంగా నేడు హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లో జనాల మధ్య పండుగను ఘనంగా జరుపుకున్నారు.
Kishan Reddy : చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి.. జరిగిన దాడిని ఖండిస్తూ కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి స్పందించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగ రాజన్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన అన్నారు. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారని ఆయన కొనియాడారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో…
CM Yogi Adityanath: బంగ్లాదేశ్‌లో హిందువులను సెలెక్టివ్‌గా టార్గెట్ చేస్తున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఆరోపించారు. సనాతన ధర్మానికి ఎదురయ్యే బెదిరింపులను ఎదుర్కోవడానికి ఐక్యత అవసరమని ఆయన బుధవారం అన్నారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం చెన్నైలో నిరసనను నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర విభాగం తెలిపింది. ఈ వ్యవహారంలో మరో మంత్రి పీకే శేఖర్‌బాబును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది.