CM Revanth: మేడారంలో శ్రీ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్ల ఆలయ అభివృద్ధి, విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్‌లను అధికారులు పూజారులకు, ఆదివాసీ సంఘాలకు వివరించారు. ఈ ప్రణాళికలపై ఆలయ పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం, వారి ఏకాభిప్రాయం పొందిన తర్వాతనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. మేడారంలో ఆలయ…