మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. తాను ఎలాంటి కాంట్రాక్టు లబ్ధి కోసం తాపత్రయపడే వ్యక్తిని కాదని, రూ.70 కోట్ల కాంట్రాక్ట్ కోసం పరితపించే అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ‘మేడారం’ మహాజాతర తేదీలు ఖరారు అయ్యాయి. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుందని పూజారుల సంఘం ప్రకటించింది. సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం 2026 మేడారం మహాజాతర తేదీలను ఖరారు చేసి.. దేవాదాయ శాఖకు పంపించింది. త్వరలోనే దేవాదాయ శాఖ ఆమోదం తెలపనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క-సారలమ్మలు వెలిసి ఉన్న విషయం తెలిసిందే. Also Read: ENG vs IND: నేటి నుంచే…
Medaram Jathara: నాలుగు రోజులుగా జరుగుతున్న మేడారం మహాజాతర తుది దశకు చేరుకుంది. ఈరోజు అమ్మవారి రాకతో జాతర ముగుస్తుంది. ఈరోజు సాయంత్రం పూజారులు పొలాల్లోకి వచ్చి సంప్రదాయ పూజలు నిర్వహిస్తున్నారు.
నాలుగు రోజులుగా కొనసాగుతున్న మేడారం మహాజాతర చివరి అంకానికి చేరుకుంది. నేడు వన దేవతలు వన ప్రవేశంతో జాతర ముగియనుంది. నేటి సాయంత్రం పూజారులు గద్దెల దగ్గరకు వచ్చి సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత వన దేవతల వన ప్రవేశం స్టార్ట్ అవుతుంది.
Medaram: ఆదివాసీలది విశిష్టమైన జీవన విధానం.. ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలతో జీవిస్తున్నారు. మేడారం సమ్మక్క- సారలమ్మ ప్రకృతితో ఐక్యంగా ఉండే ఈ గిరిజనుల ప్రధాన దేవతలు. ఈ మహా జాతర ప్రతి రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి ముందు నాలుగు రోజుల పాటు జరుగుతుంది.
తెలంగాణలో బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. ఒకప్పుడు ఆదివాసీలు, గ్రామీణులు మాత్రమే ఈ జాతరలో పాల్గొనే వారు. ఈ జాతరకు రెండు దశాబ్దాల క్రితం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎడ్ల బండ్లలో తరలి వెళ్లేవారు. కాల క్రమేణా జంపన్న వాగు పై బ్రిడ్జి నిర్మాణం అనంతరం ఎడ్ల బండ్లపై వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారి సంఖ్య అధికమైంది. 2012లో మొదటి సారిగా హెలికాప్టర్ ద్వారా రాకపోకలను…
జన సంద్రంతో హోరు ఎత్తే జాతర.. మేడారం సమ్మక్క, సారక్క జాతర ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఈ జాతరకు పేరుంది. జాతరకు ఇంకా సమయం ఉన్న అప్పుడే భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆర్టీసీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులను నడపడానికి సిద్ధమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే జాతర కోసం టీఎస్…
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ను తెలంగాణ మంత్రులు కోరారు. ఈమేరకు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు బుధవారం దిల్లీకి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. మేడారం జాతరకు ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని, కేంద్రం నుంచి కూడా…