సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదుల కింద దేవాలయాల కోసం వెతికే వారు శాంతిని కోరుకోలేదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని మరో మసీదు కూడా వివాదస్పదమైంది. జౌన్‌పూర్‌లోని ‘‘ అటాటా మసీదు’’ అంశం న్యాయస్థానంలో ఉంది. ఈ మసీదు హిందూ ఆలయమని కన్నౌజ్ రాజు విజయ్ చంద్ర ‘‘అటలా దేవి ఆలయం’’ నిర్మించారని హిందూ పక్షం చెబుతోంది. 14వ శతాబ్ధంలో ఫిరోజ్ షా తుగ్లక్ ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడని,