సుకుమార్, దేవిశ్రీ కాంబినేషన్ అనగానే మ్యూజికల్ హిట్స్ తో పాటు వారి కలయికలో వచ్చిన పలు సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ‘అ అంటే అమలాపురం… రింగ రింగా… డియ్యాలో డియ్యాలో…. జిల్ జిల్ జిగేలు రాణి’ వంటికి మచ్చుకు కొన్ని. ఇక వారికి అల్లు అర్జున్ లాంటి స్టార్ తోడైతే ఆగ్నికి ఆజ్యం పోసినట్లే. తాజాగా వీరి ముగ్గురి కలయికలో వస్తున్న ‘పుష్ప’ సినిమా సూపర్ ఐటమ్ ని ప్లాన్ చేశారు. దీనికోసం…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం “పుష్ప”తో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే రీసెంట్ గా ఈ చిత్రం హిందీ వెర్షన్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి. డబ్బింగ్ రైట్స్ సమస్య కారణంగా డిసెంబర్ 17న ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చు అని అన్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ రూమర్స్ కు కొత్త పోస్టర్ ద్వారా సినిమా హిందీ…
దక్షిణాది స్టైల్ ఐకాన్, ఫ్యాషన్ దివా సమంత రూత్ ప్రభు తన కెరీర్లో మరో మైల్ స్టోన్ దాటింది. ఇంట్లో ఉన్నా లేదా ఏదైనా ఈవెంట్‌లో ఉన్నా సమంత డ్రెస్సింగ్ స్టైల్ ట్రెండ్‌ను పర్ఫెక్ట్‌గా మారుస్తుంది. సోషల్ మీడియా క్వీన్ అయిన సమంత రూత్ ప్రభుకు తన పోస్ట్‌లతో ఎలా అందరి దృష్టిని ఆకర్షించాలో బాగా తెలుసు. ఆమె ఏదైనా పోస్ట్ చేస్తే చాలు నిమిషాల్లోనే దానికి లక్షల్లో లైకులు, షేర్లు వస్తాయి. ఆమెకు సౌత్ లో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ “పుష్ప”లో సౌత్ సైరన్ సమంత రూత్ ప్రభు స్పెషల్ నంబర్ కోసం ఎంపిక అయ్యిందని అందరికీ తెలుసు. ఈ సినిమాపై భారీ ఖర్చు పెట్టిన దర్శకనిర్మాతలు సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే మేకర్స్ ప్రస్తుతం అల్లు అర్జున్, సమంతల మధ్య వచ్చే ఐటమ్ నంబర్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోని భారీ సెట్‌లో షూట్ చేస్తున్నారు. ఈ మేరకు…
అక్కినేని నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత రూటు మార్చింది. ఒకపక్క సినిమాలు, మరో పక్క యాడ్స్ తో బిజీగా మారిపోయింది. ఇక తాజాగా అమ్మడు కవర్ పేజీ కూడా ఎక్కేసింది. ‘ఎల్లే ఇండియా’ మ్యాగజైన్ కవర్ పేజీ లో గ్లామర్ ఫోజ్ లో పిచ్చెక్కిస్తోంది. రెడ్ హాట్ డ్రెస్ వేసుకొని సోఫాలో తాపీగా కూర్చొని మోడల్ లుక్ తో మెరిపించింది. ఇక ఈ కవర్ పేజీని సామ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో పలు ప్రాజెక్టులు చేస్తున్న అమ్మడు తాజాగా హాలీవుడ్ కి కూడా పయనమైన సంగతి తెలిసిందే. ‘ ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్‘ చిత్రంతో సామ్ హాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ ఆఫర్ వచ్చినప్పటినుంచి.. సామ్ వెనుక ఉన్న…
సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సమంత తన కెరీర్లో తొలిసారిగా ఓ స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోనుంది. ‘పుష్ప’ స్పెషల్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో పాటు సామ్ బోల్డ్ లుక్ లో చిందేయనుంది. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ సాంగ్ లో చేసేవారి క్రేజ్ మరింత పెరుగుతుంది…
సౌత్ స్టార్ సమంత ఈరోజు బిగ్ అనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సామ్ గ్లోబల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘డౌన్‌టౌన్ అబ్బే’ ఫేమ్‌కు బాఫ్టా-విజేత చిత్రనిర్మాత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించే ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’తో ఈ నటి అంతర్జాతీయ చలనచిత్ర రంగ ప్రవేశం చేయనుంది. జాన్‌తో ఉన్న ఫోటోను పంచుకుంటూ సమంత “ఒక సరికొత్త ప్రపంచం! నేను చివరిసారిగా 2009లో ‘ఏ మాయ…
సమంత అభిమానులకు గుడ్ న్యూస్… సామ్ ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేసింది. అన్ని అడ్డంకులు, సరిహద్దులను చెరిపేసేందుకు మరో ప్లాన్ వేసింది. సౌత్ లో పాపులర్ అయిన సామ్ అందరికీ షాకిస్తూ బాలీవుడ్ బడా హీరోయిన్లకు సైతం దొరకని అవకాశాన్ని పట్టేసింది. తాజాగా సమంతా తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి అక్కినేని కాంపౌండ్ లో అడుపెట్టింది. భర్త చైతన్యతో విడిపోయాక తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టిన అమ్మడు మళ్లీ అక్కినేని కాంపౌండ్ లో అడుగుపెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే సామ్ అక్కడికి వెళ్లడానికి కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే సామ్ వెళ్ళడానికి వ్యక్తిగత కారణం లేదని, ఆమె తన సినిమా డబ్బింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ గుణశేఖర్ దర్శకత్వంలో…