సౌత్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు తన ఖాతాలో మరో అరుదైన రికార్డును సృష్టించింది. వృత్తిపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల సమంతా ఈ ఏడాది మొత్తం మీడియాలో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక తెలుగులో సామ్ జామ్‌తో హోస్ట్‌గా ఓటిటి అరంగేట్రం చేయడంతో పాటు ఈ సంవత్సరం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి వెబ్ సిరీస్ తో తన పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అల్లు అర్జున్ రాబోయే పాన్ ఇండియన్ మూవీలో సామ్ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ అంటే ‘భీమ్లా నాయక్’కి భయం లేదట!
ఇక వ్యక్తిగతంగా భర్త నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించడం మరో సంచలనం. ఆమె ప్రకటనతో చాలా మంది అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియా పోస్ట్‌తో చై-సామ్ అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇదంతా ఎందుకంటే సామ్ మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా ఇండియాలోనే టాప్ 10 లిస్ట్ లో స్థానం దక్కించుకుంది. మొదటిసారిగా యాహూ ఇండియాలో ఈ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ చేసిన సెలెబ్రిటీల జాబితాలోకి సామ్ ప్రవేశించింది. ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది
ఇక ఈ లిస్ట్ లో కరీనా కపూర్ ఖాన్ 1వ స్థానంలో, కత్రినా కైఫ్ , ప్రియాంక చోప్రా జోనాస్, అలియా భట్ , దీపికా పదుకొణె వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో నిలిచారు. దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా యాహూ జాబితా ప్రకారం అత్యధికంగా సెర్చ్ చేసిన మేల్ సెలబ్రిటీగా నిలిచాడు. తరువాత సల్మాన్ ఖాన్ , అల్లు అర్జున్ వరుసగా రెండు మరియు మూడవ స్థానాల్లో ఉన్నారు.