నేను డిమాండ్ చేయను… కానీ… ట్రోలింగ్ పై సమంత రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ స్టార్ హీరోయిన్ గా ఇప్పటికి వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్న సమంత ఇటీవల దారుణంగా ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే. నాగ చైతన్యతో 4 సంవత్సరాల వివాహ బంధం తర్వాత విడిపోతున్నట్లుగా రీసెంట్ గా ప్రకటించింది. సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో కఠినమైన స్టేజ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టింది. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత తాను ఎదుర్కొన్న ఎడతెగని ట్రోలింగ్ గురించి సమంత స్పందించింది.
Read Also : ఫ్రెండ్స్ తో మహేష్ ఫ్యామిలీ వీకెండ్ మస్తీ… పిక్స్ వైరల్
Also Read
అన్ని విషయాలను అందరూ అంగీకరిస్తారని తాను ఆశించడం లేదని, కానీ ఏదైనా ఒక భావాన్ని వ్యక్తం చేయడానికి ముందు కాస్త ఆలోచించాలని చెప్పుకొచ్చింది. “నేను అన్ కండిషనల్ యాక్సెప్టెన్స్ ను డిమాండ్ చేయను. విభిన్న అభిప్రాయాలను కలిగి ఉండమని ప్రజలను ప్రోత్సహిస్తాను. అయితే విభిన్నమైన అభిప్రాయాలూ ఉన్నప్పటికీ మనం ఒకరినొకరు ప్రేమించుకోవచ్చు. ఒకరిపై కరుణను చూపించవచ్చు. వారి నిరాశను మరింత నాగరికంగా వ్యక్తం చేయమని మాత్రమే నేను వారిని రిక్వెస్ట్ చేస్తాను” అని చెప్పింది.
Read Also : ఏఎన్నార్ ను ఇమిటేట్ చేసిన బాలయ్య… వీడియో వైరల్
కాగా సామ్ సినిమాల విషయానికొస్తే… సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్”లో స్పెషల్ సాంగ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన పౌరాణిక డ్రామా “శాకుంతలం” పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనే నాటకం ఆధారంగా రూపొందింది. శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా, దుష్యంతగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతితో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రం షూటింగ్ ను కూడా ముగించింది. ఇటీవలే తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీని సామ్ ప్రకటించింది.
తాజావార్తలు
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!