టాలీవుడ్ అడోరబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత- నాగ చైతన్య జంట విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ తరువాత విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులకు షాక్ కి గురిచేసింది. ఇక ఈ నిర్ణయం వెనుక తప్పు ఎవరిది..? అని సోషల్ మీడియాలో వచ్చిన ప్రశ్నలకు ఏ ఒక్కరు సంధానం చెప్పలేదు.. విడాకుల తరువాత చైతు తన సినిమాలతో బిజీగా మారాడు .. మరోపక్క సామ్ కూడా డివోర్స్ తర్వాత జాతీయ- అంతర్జాతీయ అవకాశాలను అందుకొని ముందుకు దూసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సామ్ తన విడాకుల తరువాత ఎంత బాధపడింది అనేది బయటపెట్టింది.
తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సామ్ మాట్లాడుతూ ” మా ఇద్దరి మధ్య జరిగిన చాలా చర్చల తరువాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాము.. ఇందులో తప్పు ఎవరిది నేను చెప్పలేను.. కానీ , విడాకులు తీసుకున్నాకా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో నాకు తెలిసింది .. విడాకుల తరువాత నేను చనిపోతానేమో అనుకున్నాను.. నేను అంత బలహీనురాలినా అనిపించింది. ఆ తరువాత నా సమస్యలతో నేను పోరాడాను . కృంగిపోకుండా పైకి లేచాను.. ఈరోజు నేను ఇంత దృఢంగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.