ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ “పుష్ప”లో సౌత్ సైరన్ సమంత రూత్ ప్రభు స్పెషల్ నంబర్ కోసం ఎంపిక అయ్యిందని అందరికీ తెలుసు. ఈ సినిమాపై భారీ ఖర్చు పెట్టిన దర్శకనిర్మాతలు సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే మేకర్స్ ప్రస్తుతం అల్లు అర్జున్, సమంతల మధ్య వచ్చే ఐటమ్ నంబర్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోని భారీ సెట్‌లో షూట్ చేస్తున్నారు. ఈ మేరకు సామ్ అద్భుతమైన పోస్టర్‌ను షేర్ చేస్తూ చిత్ర బృందం ఈ పాట ఈ సంవత్సరం అద్భుతమైన సాంగ్ గా ఉండబోతోంది అని ప్రేక్షకులను ఊరిస్తోంది. ఈ పిక్ లో సామ్ మొహం చూపకపోయినా, రంగురంగుల కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతున్న సామ్ తో పాటు ఈ పాట ఎలా ఉండబోతుందో ఓ ఐడియా ఇచ్చింది. హిందీ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో అల్లు అర్జున్, సమంతలపై పాటను కంపోజ్ చేస్తున్నారు.
Read Also : సిరివెన్నెల పార్థీవదేహం వద్ద కన్నీరుమున్నీరైన తనికెళ్ళ
డిసెంబర్ 6న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ‘పుష్ప : ది రైజ్’ డిసెంబర్ 17న థియేటర్లలోకి రానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండల్లోని ఎర్రచందనం స్మగ్లర్ల జీవితాల ఆధారంగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.