మరో మైల్ స్టోన్ దాటిన సామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది స్టైల్ ఐకాన్, ఫ్యాషన్ దివా సమంత రూత్ ప్రభు తన కెరీర్లో మరో మైల్ స్టోన్ దాటింది. ఇంట్లో ఉన్నా లేదా ఏదైనా ఈవెంట్‌లో ఉన్నా సమంత డ్రెస్సింగ్ స్టైల్ ట్రెండ్‌ను పర్ఫెక్ట్‌గా మారుస్తుంది. సోషల్ మీడియా క్వీన్ అయిన సమంత రూత్ ప్రభుకు తన పోస్ట్‌లతో ఎలా అందరి దృష్టిని ఆకర్షించాలో బాగా తెలుసు. ఆమె ఏదైనా పోస్ట్ చేస్తే చాలు నిమిషాల్లోనే దానికి లక్షల్లో లైకులు, షేర్లు వస్తాయి. ఆమెకు సౌత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఘనత సాధించింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ల ఫాలోవర్స్ మార్క్‌ను అధిగమించింది. నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత చేసిన అరుదైన ఫీట్ ఇది.
Read Also : ఒకనాడు రామారావు… నేడు ‘అఖండ’ : బాలకృష్ణ
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ఇక సామ్ సినిమాల విషయానికొస్తే ఆమె సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్”లో స్పెషల్ సాంగ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘పుష్ప’ సెట్స్‌లో చేరిన సామ్, బన్నీపై మేకర్స్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక గుణశేఖర్ దర్శకత్వం వహించిన పౌరాణిక డ్రామా “శాకుంతలం” పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం కాళిదాసు రచించిన ‘అభిజ్ఞానశాకుంతలం’ అనే నాటకం ఆధారంగా రూపొందింది. శకుంతల పాత్రలో సమంత నటిస్తుండగా, దుష్యంతగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార, విజయ్ సేతుపతితో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రం షూటింగ్ ను కూడా ముగించింది. ఇటీవలే తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీని సామ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!