టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం “పుష్ప”తో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే రీసెంట్ గా ఈ చిత్రం హిందీ వెర్షన్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి. డబ్బింగ్ రైట్స్ సమస్య కారణంగా డిసెంబర్ 17న ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చు అని అన్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ ఈ రూమర్స్ కు కొత్త పోస్టర్ ద్వారా సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ డేట్ ను ఖరారు చేస్తూ చెక్ పెట్టేశారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ‘పుష్ప’ హిందీ వెర్షన్ కూడా డిసెంబర్ 17న విడుదల అవుతుందని ప్రకటించారు.
Read Also : కోడి రామకృష్ణ, బి.గోపాల్ సరసన బోయపాటి శ్రీను!
మొదట్లో సినిమాను హిందీలో సినిమా థియేటర్స్ చేయాలని అనుకోలేదు చిత్రబృందం. అందుకే మేకర్స్ ‘పుష్ప’ హిందీ డబ్బింగ్ రైట్స్ ను గోల్డ్‌మైన్ ఫిల్మ్స్‌కు అమ్మేశారు. అయితే తరువాత ‘పుష్ప’ మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకోవడంతో సమస్య మొదలైంది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ హక్కులను ‘ గోల్డ్‌మైన్ ఫిల్మ్స్’కి విక్రయించిన మైత్రి మూవీ మేకర్స్ తరువాత హిందీ వెర్షన్‌ను కూడా థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ దీనికి గోల్డ్ మైన్స్ టీమ్ అప్పుడు సిద్ధంగా లేదు. దీంతో మేకర్స్ ఈ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు గోల్డ్ మైన్స్ సంస్థ హిందీ వెర్షన్‌ను మరొక పంపిణీ సంస్థతో కలిసి రిలీజ్ చేయబోతోంది. తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.
Read Also : విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న “స్పైడర్ మ్యాన్”
ఈ చిత్రంలో తెలుగులో అరంగేట్రం చేస్తున్న మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండగా, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, సునీల్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదల గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఆర్య, ఆర్య 2 చిత్రాలలో బన్నీతో కలిసి పని చేసిన సుకుమార్ కాంబో ఈ సినిమాతో మరోసారి రిపీట్ అయ్యింది. మరి అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ అంటూ హ్యాట్రిక్ హిట్ కొడతాడా ? అనేది చూడాలి.