Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం కూడా తెల్సిందే. అయితే మాత్రం ఏం.. సామ్.. నిత్యం సోషల్ మీడియాలో అమ్మడు హల్చల్ చేస్తూనే ఉంది.
సౌత్ క్వీన్ సమంత ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఆమె స్టైల్ ను చూసి ఫ్యాషన్ ప్రియులు సైతం అబ్బురపడుతూ ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ హ్యాండ్ పెయింటెడ్ శారీలో మెరిసింది. నటి అర్చన జాజు చేతితో పెయింట్ చేసిన చీర కట్టుకుని అద్భుతమైన లుక్ తో ఆకట్టుకుంటోంది. సామ్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో ఏముంది ? అంటే… ఆమె కట్టుకున్న చీర ధర తెలిస్తే…