సక్సెస్ కోసం పరిగెత్తిన రోజులు.. బాక్సాఫీసు నంబర్ల కోసం ఆందోళన పడిన రాత్రులు.. ఇవన్నీ ఒక క్షణంలో తలకిందులయ్యాయి అంటున్నారు సమంత. విజయం, ఖ్యాతి, డబ్బు అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే జీవితం అసంపూర్ణం. మయోసైటిస్ వ్యాధితో పోరాడిన తర్వాత ఆమె జీవితం, ఆలోచనలు, ప్రాధాన్యతలు అన్నీ మారిపోయాయి. గతంలో విజయాలు అనుకున్నప్పటికీ, ఇప్పుడు జీవితాన్ని చూసే దృక్పథం మారిపోయిందని ఆమె వెల్లడించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత, తన అనుభవాలను పంచుకున్నారు.…