వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ దొరుకుతుంది. నేడు 10వ రోజు బస్సుయాత్రలో భాగంగా రాయలసీమలో ఆళ్లగడ్డ, కోస్తాంధ్రాలో వినుకొండ, ఉత్తరాంధ్రాలో ఆముదాలవలసలో ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి సారథ్యంలో బస్సు యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు మహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ప్రెస్ మీట్.. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ చేయనపున్నారు. ఇక, సాయంత్రం 4 గంటలకు వైసీపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఇక, పల్నాడు జిల్లాలోని వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ సామాజికి సాధికార బస్సు యాత్ర కొనసాగనుంది. వినుకొండ రూరల్ మండలం విఠంరాజుపల్లిలో సుజికీ కార్ షోరూమ్ దగ్గర మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అనంతరం మధ్యహ్నం 3 గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు శివయ్య స్థూపం సెంటర్ దగ్గర వైసీపీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Read Also: Bhakthi TV : మంగళవారం హనుమాన్ చాలీసా వింటే అపార శక్తిని పొంది అనుకున్నవన్నీ సాధిస్తారు
అలాగే, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో ఎమ్మెల్యే తమ్మినేని సీతారం వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వాకలవలస వద్ద శ్రీ ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రులు పత్రికా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గేటు పాఠశాలలో మనబడి నాడు నేడు పాఠశాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఆమదాలవలస వైఎస్ఆర్ కూడలి దగ్గర ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆముదాలవలస బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి చేరుకొని అశేష జనవాహినికి మంత్రుల ప్రసంగాలు చేయనున్నారు.