డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు, కృష్ణ జింకలు వేటాడిన కేసు… ఇలా సల్మాన్ ఖాన్ కు పోలీస్ పిలుపులు, కోర్టు కష్టాలు కొత్తేం కాదు. కానీ, ఈసారి అతడి చెల్లెలు అల్వీరా ఖాన్ కూడా చిక్కుల్లో పడింది. ఛంఢీఘర్ లోని ఒక లోకల్ బిజినెస్ మ్యాన్ స్థానిక పోలీసుల్ని ఆశ్రయించాడు. ‘బీయింగ్ హ్యూమన్’ బ్రాండ్ నేమ్ తో సల్మాన్ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. అదే పేరుతో జ్యుయెలరీ అమ్మటం కూడా చేస్తుంటారు. ఛంఢీఘర్ లోని బిజినెస్ మ్యాన్…